బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ కు ముంబయి పోలీసులు మంగళవారం సమన్లు జారీ చేశారు. అతనికి అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీతో సంబంధాలున్నాయని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా అరుణ్ గావ్లీని కలిసినందుకే ఇలా జరిగిందంటున్నారు. కార్పొరేటర్ కమ్లాకర్ జమ్ సందేకర్ హత్య కేసులో అరుణ్ గావ్లీ శిక్ష అనుభవిస్తున్నాడు. ముద్దాయిగా ఉన్న అతన్ని, అనుమతి లేకుండా కలవడం నేరంగా పరిగణిస్తున్నారు. కాగా అర్జున్ రాంపాల్ 'డాడీ' చిత్రంలో డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం గావ్లీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలోని సన్నివేశాలను మరింత రక్తి కట్టించేందుకు అర్జున్ రాంపాల్, అరుణ్ గావ్లీని కలిసినట్టు సమాచారం. డిసెంబర్ 29న జేజే ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ గా ఉన్న అర్జున్ గావ్లీతో సుమారు గంటపాటు అర్జున్ రాంపాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. సమన్ల లో గావ్లీని కలవడానికి గల కారణాలను రాంపాల్ ను వివరణ కోరారట.