ఇంతలో రాశిఖన్నాలో ఎంత మార్పు

April 23, 2016 | 04:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Rashi-Khanna-dance-supreme-title-song-niharonline

గ్లామర్ ఉన్నప్పటికీ యాక్షన్, డాన్స్, అస్సలు రావని, కేవలం స్కిన్ షోతోనే గడిపేస్తుందని, అందుకే సక్సెస్ ఆమె సొంతం కావట్లేదని రాశిఖన్నాపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో కెరీర్ ప్రారంభించిన హీరోయిన్లంతా టాప్ రేసులో దూసుకెళ్లిపోతుంటే, రాశి మాత్రం చాలా వెనుకబడి ఉంది. దీంతో హిట్ కొట్టాలన్న కసి బాగా పెంచేసుకున్నట్లు ఉంది.

                               రీసెంట్ గా సుప్రీంలో సాయి ధరమ్ తేజ్ తో జోడి కడుతుంది ఈ బొద్దుగుమ్మ. ఇందులో ఓ పోలీసాఫీసర్ పాత్రలో అలరించనుంది. అయితే ట్రైలర్ లో అమ్మడి ఎనర్జిటిక్ ఫెర్మామెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాదు సుప్రీం టైటిల్ సాంగ్ లో సాయితో పోటీ పడి స్టెప్పులేసింది. పాటలో రాశి ఖన్నా గ్లామర్‌తో పాటు ఆమె అందమైన నడుము తిప్పటం చూసి ఆడియన్స్ విజిల్స్ వేయటం ఖాయం. ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోయిన్లలో డాన్సర్ లలో తమన్నా, ఆ తర్వాత శృతీహాసన్ ఉంది. ఇప్పుడు వారిద్దరి సరసన రాశి కూడా చేరిపోయినట్లు క్లియర్ గా తెలుస్తోంది. వరుస ఫ్లాపులు ఇచ్చిన ఎఫెక్టు ఈ భామలో చాలా మార్పు తెచ్చినట్లు ఉంది. పోటీలో ఉండాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా మరీ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ