రెండు మూడు సినిమాలలో నటించి యూత్ లో పిచ్చ పిచ్చగా క్రేజ్ పేంచేసుకుంది బబ్లీ బ్యూటీ రాశిఖన్నా. చిన్న సినిమాల నుంచి ఏకంగా మాస్ రాజా రవితేజతో నటించే గొల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ, ఇప్పుడు మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు ముద్దుగుమ్మను ప్రశాంతంగా ఉండనివటం లేదట. రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం బెంగాల్ టైగర్. ఇందులో తమన్నా ఓ కథానాయిక. కాగా, రాశిఖన్నాను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్త ఇటీవల తెలియవచ్చింది. దీంతో రాశి కాస్తా భాదతో ఉంది. ‘ఈ చిత్రంలో నాది సెకండ్ హీరోయిన్ పాత్ర కాదు. హీరోయిన్ పాత్రనే. మా ఇద్దరికి ఇందులో సమాన పాత్ర ఉంది. కథ చెప్పే సమయంలో దర్శకుడు సంపత్ నంది ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు’ అంటూ చెప్పుకొచ్చింది. అంతెలే అలా అనుకోపోతే కష్టం కదా రాశి. అయినా చిన్న సినిమాల్లో చేసినప్పుడు ఇలాంటి ఆఫర్లే వస్తాయని, వచ్చిన అవకాశాలను వచ్చినట్టు అందుకోని దూసుకెళ్లాలి అంటున్నారు ఆమె సన్నిహితులు.