మ్యాగీలో ప్రమాదకర రసాయనాలున్నాయని ఆరోపణలపై... ఈ మధ్య సినీ నటులు మాధురీ, అమితాబ్, ప్రీతి జింతాలపై కేసులు పెట్టడం... న్యూస్ ఛానెళ్ళలో, పోర్టల్లలో వార్తల ప్రచారం జరిగింది. దీనిపై సీనియర్ నటి రవీనా టాండన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఫుడ్ ప్రొడక్టుపై నిషేధం విధించడం సమంజసమే కానీ, దాని ప్రచార కర్తలుగా పని చేసిన వారు ఎలా బాధ్యులు అవుతారని ఆమె ప్రశ్నిస్తోంది. ఆ ప్రొడక్టును మార్కెట్ లోకి అనుమతించింది ప్రభుత్వం. ఒక ప్రాడక్టు క్వాలిటీ ఎలా ఉందో నిర్ణయించి దాన్ని మార్కెట్లోకి అనుమతించేది ప్రభుత్వమే. కొన్ని ఆహార పదార్థాలను ప్రభుత్వమే ఆమోదించినపుడు మేం వాటికి ప్రచాకరక్తులగా వ్యవహరిస్తే తప్పేంటి? మ్యాగీ తప్పు చేస్తే ఆ బ్రాండుకు ప్రచారం చేసిన మా సినిమా వాళ్ళ మీద కేసులు వేయడం ఏమిటని అంటోంది. దాదాపు 30 ఏళ్లుగా మ్యాగీ మార్కెట్లో ఉంది. మరి ఇన్నేళ్ళుగా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు. ప్రభుత్వం ఆమోదించింది కాబట్టే మేం ప్రచారం చేశాం. తీరా ఇప్పుడు హఠాత్తుగా నిద్రలేచి ఆ ఉతప్పత్తులు ప్రమాదకరం అంటూ మా మీద పడితే మేమేం చేస్తాం. నేను ఏనాడూ సిగరెట్లు, మద్యం లాంటి అనారోగ్యకరమైన ఉత్పత్తులకు ప్రచారం చేయలేదు. ఈ మధ్య యోగర్ట్ ఉత్పత్తికి ప్రచారం కోసం అడిగారు. మ్యాగీ అనుభవం దృష్టిలో పెట్టుకొని దాని క్వాలిటీ గురించి తెలుసుకున్నాను. ల్యాబ్ రిపోర్ట్ చూశాకే దాని ఎండార్స్ మెంట్ పై సంతకం చేస్తాను అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.