టాలీవుడ్ మహేష్, పవన్ ల తర్వాత స్థానం ఎవరిదనేది ఎవరూ చెప్పలేం. ఎన్టీఆర్, బన్నీ, రాంచరణ్, ప్రభాస్, మరికొందరు యువహీరోలు లిస్ట్ లో చేరారు. అయితే వీరందరిలో ప్రత్యేక స్థానం మాత్రం ముమ్మాటికీ అల్లు అర్జున్ దే. వరుసగా మూడు 50 కోట్ల సినిమాలు ఇచ్చిన ఏకైక హీరో మన స్టైలిష్ స్టార్. రేసు గుర్రం ఇచ్చిన కిక్ అలాంటిది మరి.ఓ వైపు స్టైలిష్ స్టార్ గా యూత్ మదిలో స్థిరపడిపోయి ఇంకోవైపు ఫ్యామిలీ ప్రేక్షకుల దృష్టిలో మోస్ట్ ఎంటర్ టైనింగ్ స్టార్ గా ముద్రపడిపోయాడు. ఇక ఇప్పుడు ఫస్ట్ టైం ఫుల్ మాస్ మసాలా సరైనోడుతో మన ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్ర రిలీజ్ బిజినెస్ మాత్రం దిమ్మతిరిగే స్థాయికి జరిగింది. దాదాపు 75 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు శాటిలైట్ రూపంలో మరో పెద్ద షాకిచ్చింది. ఏకంగా 16 కోట్ల కు అమ్ముడుపోయి నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పిందట.
'సన్ టీవీ' నెట్ వర్క్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. ఇంతకు ముందు సర్దార్ రూ. 13 కోట్లకు అమ్ముడుపోగా, బ్రహ్మోత్సవం 12 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ లెక్కన వీరిద్దరి సినిమాల కంటే బన్నీ సినిమాకి జరిగిన ఈ భారీ బిజినెస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అంతేకాదు కొన్ని ఏరియాల్లో ఇప్పటిదాకా ఏ తెలుగు చిత్రం కూడా అమ్ముడుపోనీ రేటుకిపోయి షాక్ కి గురిచేసింది. తెలుగుతోపాటు చిత్రాన్ని తమిళ, మలయాళ, హిందీ వెర్షన్ లలో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు .. మలయాళ భాషల్లో అల్లు అర్జున్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది. అలాగే బాలీవుడ్ లోనూ బన్నీ చిత్రాలకి కూడా మంచి ఆదరణ వుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టికి కోలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఈ స్థాయి ధర పలికిందని చెప్పుకుంటున్నారు.