హీరోయిన్లు కొద్ది రోజుల్లోనే తల్లి పాత్రలకు దిగిపోతారు గానీ, హీరోలు ఒక పట్టాన తండ్రి పాత్రలు చేయరు కదా... అయినా అవసరాన్ని బట్టి కొందరు హీరోలు తండ్రీ కొడుకులుగా నటించారు గానీ రవి తేజ మాత్రం ఇంతవరకూ తండ్రి పాత్రలో నటించలేదు. రవి తేజా అంటే తూర్పుగోదావరి యాసలో సెటైర్లు, జోకులు వేసే ఆకతాయిగా కనిపిస్తాడు కానీ తండ్రిగా నటించడం అంటే ఊహించడానికి కొత్తగానే అనిపిస్తోంది. ఇంతకూ ఏ సినిమాలో అనుకుంటున్నారు... సురేంద్ర దర్శకత్వంలో వచ్చే కిక్ 2 లోనే తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అయితే ఇది పెద్ద తరహా పాత్ర కాకపోవచ్చని కొందరి ఊహాగానాలు... తండ్రీ కొడుకులుగా భిన్నంగా కనిపించాలని రవి తేజా చాలా కష్టపడ్డాడట. మరి సన్నబడి నటించిన పాత్ర తండ్రిదా కొడుకుదా? తెలియదు గానీ, వయసు పైబడిన పాత్ర మాత్రం కాదేమోననే అనుమానం కూడా కలుగుతోంది... మరి ఈ సస్పెన్స్ వీడిపోవాలంటే కిక్ సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.