సినీ రంగంలో వారసుల ట్రెండ్ ఎన్టీఆర్ తో మొదలైంది. ఇప్పుడు మూడో తరం వారసుల ట్రెండ్ కూడా నడుస్తోంది. ఈ రంగంలో నట వారసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. పోటీ కూడా మునుపటిలా లేదు. ఒకప్పుడు తెరమీదకు వచ్చి ఆ తరువాత చాలా నేర్చుకున్నారు ఇప్పుడేమో అలా కాదు, అన్ని రకాలుగా అభిమానులను మెప్పించగలగాలి. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఎంతో నేర్చుకుని ఫీల్డ్ లో ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ లో నట వారసులు ఎందరున్నారంటే నందమూరి, ఆ తరువాత దగ్గుబాటి, అక్కినేని, ఘట్టమనేని, మంచు, కొణిదెల మెగా ఫామిలీ అయిపోయారు. కానీ ఈ ఫామిలీలో అల్లు వారు కలిసిపోయారు. నిజానికి నిర్మాతలు, నటులు అయిన ఈ ఫామిలీని చిరు ఫామిలీలో కలిపేసుకోవడం... అందరినీ కలిపి మెగా ఫామిలీ అనేస్తున్నారు. వారసుల ట్రెండ్ దినదినాభివ్రుద్ధి చెందుతూనే ఉంది. నటుడు సాయి కుమార్ వారసుడు ఆది వచ్చేశాడు. కొత్తగా బెల్లం కొండ వారు, పూరీ ఫ్యామిలీ నుంచి ఆకాష్, శ్రీకాంత్ వారసుడు, శ్రీహరి వారసులూ ఉన్నారు. ఇక రవి తేజాకూ ఉన్నారు ఇద్దరు వారసులు. ఇంత మంది వారసుల్లో ఎవరి టాలెంట్ ఎంతో... ఎవరు ఈ ఫీల్డ్ పట్ల ఆసక్తి చూపుతున్నారో... ఎవరి అద్రుష్టం ఎలా ఉందో కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు పైన కనిపిస్తున్న సెల్ఫీ చూశారుగా... రవి తేజ వారసుడు మహధాన్. ఇంకో వారసుడు మక్షద... చాలా కొత్త పేర్లు. ఇప్పటి వరకూ ఈయన ఫామిలీని ఎక్కడా చూసినట్లు అనిపించదు. ఇదిగో ఈ సెల్ఫీ మాత్రం తన సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేశాడు. అభిమానులకు నటుల మీద ఎంత ప్రేమ ఉంటుందో వారి ఫామిలీ అన్నా అంతే క్రేజ్... ఈ సెల్ఫీతో మాస్ మహారాజ్ అభిమానుల దిల్ కుషీ అయిపోయింది.