అట్టర్ ఫ్లాప్ సినిమాలకు అంత తొందరెందుకు?

November 05, 2015 | 12:44 PM | 3 Views
ప్రింట్ కామెంట్
reason-behind-flop-movie-hurry-on-television-niharonline

కొన్ని నెలల క్రితం తెలుగు సినీ నిర్మాతలకు, వీడియో హక్కుదారుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. వందరోజులు పూర్తికాకముందే ఏ చిత్రానికి సంబంధించిన డీవీడీలుగానీ ఒరిజినల్ ప్రింట్ కు సంబంధించి వీడియో పాటలు, క్లిప్ లు గానీ విడుదల చెయ్యోద్దని దాని సారాంశం. దాదాపు ఇదే రకమైన ఒప్పందం బుల్లితెర నిర్వాహకులతో కూడా కుదుర్చుకుంది. కానీ, టీఆర్పీ మోజులో ఆ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి ప్రస్తుతం కొన్ని చానెళ్లు.  టీఆర్పీ రేటింగ్ కోసం సినిమా 50 రోజులు పూర్తవ్వగానే టెలికాస్ట్ చేసేస్తున్నారు. జనాల్లో నానుతున్న సినిమాలను ఎంత త్వరగా వదిలితే అంత రేటింగ్ రాబట్టవచ్చని వారి ప్లాన్. అయితే హిట్ సినిమాలకు వర్తించే ఈ సూత్రాన్ని ఫ్లాప్ సినిమాలకు ఫాలో అవుతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.  

ఉదాహరణకు ఈ మధ్య ఓ నెల రోజుల క్రితం రామ్ హీరోగా శివమ్ అనే సినిమా వచ్చింది. అక్టోబర్ 2న విడుదల అయిన ఈ చిత్రం మూసా ఫార్ములా సినిమా కావటంతో వచ్చినట్లే వచ్చి పోయింది. అట్టర్ ఫ్లాప్ అయిన  ఆ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైపోతుంది ఓ పాపులర్ టీవీ చానెల్. దీనికి కారణం లేకపోలేదు.

సాధారణంగా సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చాక థియేటర్లకు వెళ్లి చూడటానికి ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ అస్సలు ఇష్టపడరు. తీరిగ్గా టీవీల్లో వేస్తారు కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అయితే ఫలితంతో సంబంధం లేకుండా టీవీ చానెళ్లు భారీ ధరలకు అప్పటికే ఆయా చిత్రాల శాటిరైట్ లు కొనేసి ఉంటాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తమ ఛానెళ్లకు నష్టం వాటిల్లకూడదన్న ఆలోచనల్లోనే అవి ఉంటాయి. తీరిగ్గా ఓ సంవత్సరం తర్వాత ఆయా చిత్రాలను టెలికాస్ట్ చేస్తే జనాలు మరిచిపోయే అవకాశం ఉంది. తెలుగులో ఓ సామెత ఉంటుంది. పెట్టె వేడిగా ఉన్నప్పుడే ఇస్త్రీ చెసేయ్యాలని. ఆ సూత్రాన్నే ఇప్పుడు చానెళ్లు ఫాలో అయిపోతున్నాయి. జనాళ్ల నోళ్లలో  ఉన్నప్పుడే టీవీల్లో ప్రసారం చేస్తే ఖచ్చితంగా వాటిని చూస్తారన్న సూత్రాన్ని ఫాలో అవుతుంది. అదన్నమాట అట్టర్ ఫ్లాప్ సినిమాల తొందర వెనుక కథ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ