బాహుబలిలో కోట ఎందుకు లేరంటే...

April 18, 2016 | 02:35 PM | 5 Views
ప్రింట్ కామెంట్
rajamouli-kota-srinivas-rao-baahubali-character-niharonline

ఓ సినిమా సంచలన విజయం సాధించి, కాసుల వర్షం కురిపించి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చాక అందులోని లోటుపాట్లు గురించి చర్చ జరగటం కామనే. రాజమౌళి నాలుగేళ్లు కష్టపడి తీర్చి దిద్దిన బాహుబలి విషయంలో కూడా కొన్ని ఇలాంటి కామెంట్లు వినిపించాయి. సినిమాలో అసలు తెలుగు నటులను ఎందుకు తీసుకోలేదంటూ సురేష్ లాంటి సీనియర్ నటుడు రాజమౌళిపై అసంతృప్తి వెల్లగక్కిన విషయం తెలిసిందే. సీనియర్ నటి జమున అయితే ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి బాహుబలి ఓ సినిమాయే కాదని, ఓ గిమ్మిక్కు అని వ్యాఖ్యానించింది. ఎలాంటి టెక్నాలజీ లేకుండానే విఠలాచార్య లాంటి వాళ్లు అప్పట్లో గొప్ప చిత్రాలను తీశారని, ఇప్పుడున్న టెక్నాలజీ తో తీసిన ఈ సినిమా అందులో సగం స్థాయిని కూడా అందుకోలేకపోయిందని పెదవి విరిచారు. ఇవి పక్కన బెడితే బాహుబలి మూలంగా ఇందులోని నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, అదే టైంలో సినిమాలో అవకాశం రానందుకు కొంతమంది నటీనటులు అసంతృప్తికి లోనయ్యారు. ఆ జాబితాలో ఉన్నవారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఉండటం విశేషం.

                 తాజాగా  ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కోట శ్రీనివాసరావు, కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, తనకి కోట శ్రీనివాసరావు నటన అంటే ఎంతో ఇష్టమనీ .. తాను ఆయన అభిమానినని చెప్పారు. వెంటనే మైక్ అందుకున్న కోట... నీ అభిమానాన్ని పొందగలేగేంతటి నటుడినే అయితే, తనకి 'బాహుబలి'లో ఎందుకు అవకాశం ఇవ్వలేదని నవ్వుతూనే  అడిగారు. ఇక ఆయన మనసులోని అసంతృప్తిని అర్థం చేసుకున్న కీరవాణి, నవ్వుతూనే తనదైన శైలిలో కోటకి సర్దిచెప్పారు. అన్ని మంచి పాత్రలున్న ఇలాంటి చిత్రాల్లో కోట లాంటి నవరసాలు పండించే సీనియర్ ని, పైగా అన్ని భాషల్లో మంచి పేరున్న నటుడిని తీసుకోకుండా పరభాష నటులను వాడుకోవటం వెనుక జక్కన్న మనుసులో ఏం ఉందో ఎవరు చెప్పగలం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ