రెజీనా కోరికను తీర్చేది ఎవరు?

March 02, 2016 | 02:07 PM | 6 Views
ప్రింట్ కామెంట్
regina_dream_role_lady_don_niharonline

ఒకటి రెండు ఫ్లాపులు పడగానే కెరీర్ ముగిసిపోతున్న ఈరోజుల్లో వరుసగా సినిమాలతో దూసుకెళ్తుంది డస్కీ బ్యూటీ రెజీనా. కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు లేకపోయినా అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఆ మధ్య రెజీనా కస్సండ్రా అంత హాట్ కాదు అన్నవాళ్ల నోళ్లు వేళ్లబెట్టేలా ఈఫా అవార్డ్ ల్లో తన స్కిన్ షో చూపించి ఆకట్టుకుంది. వరుసగా మెగా హీరోలతో, మధ్య మధ్యలో మీడియం హీరోలతో నటిస్తున్న రెజీనా ఇప్పుడు బిజీ నటి. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి నటిగా ఆమె రాణించిన చిత్రం లేదనే చెప్పాలి. సాధారణంగా నటీనటులకు సినిమా రంగంలోకి అడుగుపెట్టాక, తమకి ఇష్టమైన పాత్రలను పోషించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం జరుగుతూ వుంటుంది. అలాగే రెజీనా కూడా తనకి ఎంతో ఇష్టమైన ఓ పాత్ర కోసం ఎదురుచూస్తుందట.

ఇంతకీ రెజీనాను అంతగా ఆకట్టుకున్న పాత్ర ఏంటనేగా... ఏం లేదండీ 'లేడీ డాన్' పాత్ర కోసం ఆమె ఎప్పటిట నుంచో ఎదురుచూస్తోందట. నటిగా తనని తాను నిరూపించుకోవాలని ఉందనీ, అందువలన డీ గ్లామరైజ్డ్ పాత్రలను సైతం పోషించాలని అనుకుంటున్నానని చెప్పింది. కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేయాలని వుందని అంది. అలాంటి పాత్రతో ఎవరైనా వస్తే చేయడానికి తాను రెడీగా వున్నానని అంది. దర్శకులు మరీ రెజీనా మాటలు వింటున్నారా? వాడుకోండయ్యా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ