అలా అంటే ఒళ్ళు మండదా రేణుకు?

June 01, 2015 | 04:48 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Renu_Desai_controversial_comments_on_Pawan_niharonline

పవన్ కళ్యాణ్ ను ఇంత కాలం ప్రతి విషయంలోనూ గొప్పవాడే నంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్ ఇప్పుడు ఓ వివాదభరిత వాక్భాణం విసిరింది. అది కూడా అభిమానులు ఎంతసేపూ పవన్ పిల్లలుగా గౌరవిస్తుంటే... వాళ్ళ కోసం ఒంటరిగా బతుకుతూ, వాళ్ళను గొప్ప వాళ్ళుగా చేయడానికి ప్రతి క్షణం తపిస్తూ ఎంతో ఆరాట పడుతుంటే.... ఓ అభిమాని చేసిన ట్వీట్ పై రేణు దేశాయ్ సీరియస్ గా స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఘాటుగా రిప్లై ఇచ్చారు. తన ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్య గురించి గొప్పగా చెప్పుకుంటూ రేణు ట్వీట్స్ చేస్తుంటుంది. సదరు ట్వీట్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పిల్లలుగా పుట్టడం వల్లనే వారికి ఎన్నో గొప్ప లక్షణాలు అబ్బాయి. అంటూ పొగడడం మొదలు పెట్టాడు. అయితే పవన్ అభిమానులు ఆ పిల్లలను ఆయన పిల్లలుగానే గౌరవిస్తుంటారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిని గుర్తించక పోవడంపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేవలం వారిని పవన్ కళ్యాణ్ పిల్లలుగానే మాత్రమే గుర్తిస్తున్న వారికి.... రిప్లై ఇస్తూ ‘ఇద్దరూ నా పిల్లలే, పవన్ కళ్యాణ్ పిల్లలు... కాదు’ అనే విధంగా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆమె స్నేహితురాలు సోనాలి కూడా రేణు కామెంట్లను సమర్దిస్తూ ‘‘అవును. వారు రేణు పిల్లలే‘‘ అంటూ ట్వీట్ చేసింది. ‘‘ఐదు సంవత్సరాలుగా తానే పెంచుకుంటోంది. ఆ పిల్లలకు ఆమె జన్మనిచ్చిన తల్లి. అతను కాదు’’ అంటూ ట్వీట్ చేసింది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ