విడిపోడానికి కారణం క్లారిటీ లేదు

December 06, 2014 | 04:39 PM | 23 Views
ప్రింట్ కామెంట్

ముందుగా చెప్పినట్టుగానే తన పుట్టిన రోజున తన పర్సనల్ విషయాలతో వీడియో విడుదల చేసింది రేణుదేశాయ్. ఎంత నవ్వుతూ మాట్లాడినా లోపలున్న ఉద్వేగం చాలా సందర్భాల్లో బయట పడింది. అన్నిటికన్నా ముఖ్యమైన కారణానికి మాత్రం క్లారిటీ లేదు. ‘‘విడిపోవడానికి కారణం చెప్పినా ఎవరికీ అర్థం కాదు. అది తమ ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది’’ అనేసింది. ఎవరికి ముందుగా ఈ ఆలోచన వచ్చింది. డైవర్స్ దాకా ఎందుకు వెళ్లింది. రకరకాల ఊహాగానాలకు వివరణ మాత్రం రాలేదు. కాకపోతే పవన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. రేణు మాత్రం తన ప్రేమలో మాత్రం మార్పు రాదని ఒక్కరినే ప్రేమించగలనని, మళ్లీ పెళ్లి ఆలోచనలు తనకు ఎంత మాత్రమూ రావడం లేదని అంటోంది. ఇద్దరి అభిప్రాయాలూ ఒకటే... పవన్ ప్రత్యేక వ్యక్తి, మానవతా వాది అంటోంది... కానీ విడిపోయి బతకడానికి కారణానికి మాత్రం క్లారిటీ రాలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ