సరి రారు నాకెవ్వరూ... అంటూ తన తోటి హీరోయిన్స్ పై నటి శృతి హసన్ హాట్ హాట్ కామెంట్ చేసింది. ఇంతకీ ఏమందంటే... ‘నాది ఒరిజినల్ బ్యూటి. నాకు ఎలాంటి మేకప్ లు అవసరం లేదు . కాని వేరే హీరోయిన్స్ కు మాత్రం మేకప్ వేస్తేనే అందంగా ఉంటారు. నాది నేచురల్ అందం. ఈ అందం మా అమ్మ , నాన్నల నుండి వచ్చింది . ఎందుకంటే వారు కూడా అందంగా ఉంటారు కాబట్టి’ అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించింది. అంతే కాదండోయ్ ఈ అమ్మడి అందాలన్నీ ఎక్కడెక్కడ ఏం ఏం ఉండాలో ఫర్ఫెక్ట్ గా ఉన్నాయని కూడా చెబుతుంది. అందుకేగా కుర్రాళ్లు ఈ పాప ఫోటోలను చించి దాచుకునే రేంజ్ కి వెళ్లిపోయింది. అదండీ విషయం. మరీ ఈ కామెంట్లపై ఎవరెవరూ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ ‘హాట్’ భామ తెలుగులో మహేష్ సరసన ఓ చిత్రంతోపాటు తమిళం లో విజయ్ తోపాటు మరో చిత్రంలో కూడా నటిస్తుంది.