సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెట్టే రేణు దేశాయ్ ఫాదర్స్ డే రోజు పోస్టు చేసిన ఫొటో, వ్యాఖ్యలు పవన్ అభిమానులకు మింగుడు పడకుండా అయ్యాయి. సాధారణంగా ఫాదర్స్ డే రోజు సెలబ్రిటీలంతా తమ తమ తండ్రులతో దిగిన ఫొటోలు, సందర్భాలను పోస్టు చేసి అందరితో పంచుకుంటుంటారు. అయితే రేణు దశాయ్ మాత్రం సరికొత్త ట్వీట్ చేసింది. ‘ప్రతి రోజు తల్లి తండ్రి డ్యూటీ చేయడం ఒక పరీక్ష లాంటిది. పిల్లలకు ఇద్దరి ప్రేమ పంచాలి. ఒంటరిగా ఉంటున్న తల్లులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేశారు. మరి నిజమే కదా తన పిల్లలకు తల్లీతండ్రీ తానే అయ్యింది. రెండు బాధ్యతలు తనే తీసుకుంది. ఇది ఎంత కష్టమో అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది. అయితే రేణు దేశాయ్ చేసిన ట్వీట్ పవన్ అభిమానులకు మింగుడు పడటం లేదు. రేణు దేశాయ్ చేసిన ట్వీట్స్ పవన్ కళ్యాణ్ కు డామేజింగ్ గా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకూ వెళుతుందో చూద్దాం...