ఎప్పటి కప్పుడు తన అభిప్రాయాలను, సినిమా కబుర్ల గురించి, పవన్ కళ్యాణ్ గురించిన విషయాలను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్న రేణు దేశాయ్ ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ లో పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తుందన్న విషయాలను కూడా పోస్టు చేసింది. రోడ్డు పక్కన అమ్మే చెరుకు రసం టేస్టును కూతురు ఆద్యకు రుచి చూపించడంతో పాటు...అందుకు సంబందించిన ఫోటోను పోస్టు చేసింది రేణు దేశాయ్. ‘మేమంతా కలిసి ఈ వేసవి కాలంలో తొలిసారిగా రొడ్డు పక్కన అమ్మే చెరుకు రసం రుచి చూసాం' అంటూ ట్వీట్ చేసింది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్టుకు అభిమానుల నుండి రకరకాలుగా స్పందన వచ్చింది. కొందరు సూపర్ అంటూ కామెంట్ చేస్తే, మరికొందరు రొడ్డు పక్కన అమ్మే ఇలాంటి వాటితో జాగ్రత్త, అందులో వేసే ఐస్ శుభ్రంగా ఉండదు, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందంటూ సూచనలు చేసారు. ఈ కామెంట్స్ పరిశీలిస్తే రేణు దేశాయ్ పట్ల అభిమానులు ఎంత అభిమానం ప్రదర్శిస్తున్నారో స్పష్టం అవుతోంది. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో వారిని వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళుతూ ఆనందంలో ముంచెత్తుతోంది రేణు దేశాయ్. ఆమె అట్లాంటిస్, దుబాయ్ లాంటి విహార ప్రదేశాలకు పిల్లలతో కలిసి వెళ్లినట్లు ఆమె ట్వీట్స్ బట్టి తెలుస్తోంది.