జబర్దస్త్ గా రోజా మరో గేమ్ షో

November 28, 2014 | 04:10 PM | 34 Views
ప్రింట్ కామెంట్

ఇప్పటికే ఎమ్మెల్యేగా, జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా ఫుల్ బిజీగా ఉన్న రోజా, జీ తెలుగులో మరో టీవీ షోతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ‘రేస్’ అనే టైటిల్తో త్వరలోనే ప్రారంభమమవనున్న ఈ గేమ్ షోలో ఆమెని హోస్ట్ గా చూడవచ్చు. మొదటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ వర్గాల సమాచారం ప్రకారం, యాంకర్లు ఝాన్సీ, శిల్పా చక్రవర్తిలతో పాటు కమెడియన్లు మధు, చందులు ఫస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29వ తేదీ నుంచి షో ఆడియన్స్ ముందుకు రానుంది. ఎన్నికలకు ముందు రాజకీయాలపై దృష్టి సారించిన కారణంగా టీవీ షోలకు కొంత బ్రేక్ ఇచ్చిన ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక మళ్లీ ఇలా బిజీ అవుతున్నారు. సరికొత్త గేమ్ షోలో హోస్ట్ గా చేసే అవకాశం రావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని రోజా తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. సినిమాల తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్, ఇప్పుడీ కొత్త గేమ్ షో... ఇలా ఈమె వరుసగా టీవీ షోలు చేస్తూ టీవీ రంగంలోనూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ