సతీష్‌బాబు, మెరీనా జంటగా రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్థన్ మంధుముల నిర్మాతగా నిర్మిస్తున్న రొమాన్స్ విత్ ఫైనాన్స్ చిత్రం ఆడియో పంక్షన్ హైదరాబాద్ జయబేరి క్లబ్‌లో సిని రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఉగాది పర్వదినాన జరిగిన ఈ వేడుకలో ఆహ్వాహితులను పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ థియేట్రీకల్ టైలర్‌ను విడుదల చేసి బిగ్ సిడిని రిలీజ్ చేశారు. తెలంగాణ శాసన సభ చైర్మన్ స్వామిగౌడ్ చిత్రం సిడిని విడుదల చేసి, తొలి సిడిని ప్రముఖ నటుడు,నిర్మాత ఆశోక్ కుమార్‌కు అందించారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిధి వివి వినాయక్ మాట్లాడుతూ హీరో సతీష్ మా ఊరి ప్రక్కన ఉన్న కడియం గ్రామం కుర్రాడే. మా కుటుంబానికి కావాలసిన వాడు. ఈ సినిమాను కష్టపడి ఈ స్టేజికి తీసుకొచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. దర్శకుడు రాజు కూడ రాజమండ్రికి చెందిన వాడే. స్వామిగౌడ్ , శివకుమారు, ఆశోక్ కుమార్ వంటి పెద్దలు టీమ్‌ను ఆశ్వీరదించడానికి వచ్చినందుకు థ్యాంక్స్ చేప్పుతున్నాను అన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ ఆంధ్ర,తెలంగాణ ప్రజలు నచ్చేలా ఈ చిత్రం ఉండాలి. ఈ చిత్రాన్ని నటులు, టెక్నిషన్లు కష్టపడి పని చేశారు. తప్పకుండ ఈ చిత్రం విజయవంతం కావాలి. జూనియర్ ఆర్టిస్ట్‌లకు చిన్న చిన్న రుణాలు ప్రభుత్వం అందించేలా ప్రయత్నం చేస్తున్నాం. చిన్న నిర్మాతలకు సినిమా రిలీజ్ చేయడానికి ధియేటర్లును అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. రెండు వేల ఎకరాలల్లో అన్ని వసతులతో ఒక స్టూడియో నిర్మాణం ప్రభుత్వం చేప్పట్టనుంది. నిర్మాత డబ్బులతో స్టూడియోలోకి వెళ్లితే , సినిమా పూర్తి చేసుకుని బాక్స్‌లతో రావడమే అన్నారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాతలు ఆర్ధిక సమస్యలు ఎదుర్కోంటు కష్టపడి సినిమా తీశారు. సినిమా సక్సెస్ అయి,నిర్మాతలకు డబ్బులు బాగా రావాలి. మర్ని చిత్రాలు నిర్మాతలు నిర్మించాలి అని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ రొమాన్స్ విత్ ఫైనాన్స్ చిత్రానికి వచ్చిన స్వామిగౌడ్ కి కృతజ్ఞతలు . చిన్న సినిమాను హైక్వాలీటీతో తీశారు. పాటలు చాల బాగున్నాయి. ప్రేక్షకులు సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలి అన్నారు. హీరో సతీష్‌బాబు మాట్లాడుతూ వివి వినాయక్ మా పంక్షన్‌కు రావడం చాల సంతోషంగా ఉంది. ఈ స్టేజిలో ఉండడానికి కారుకులైన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు చేప్పుకుంటున్నాను. దర్శకుడు రాజు తనకు కావాలసినట్లు చేపించుకున్నారు. కష్టపడి పని చేశాం. ఆడియో పంక్షన్ సూపర్ హిట్ అయింది. సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రాజు కుంపట్ల మాట్లాడుతూ ఈ చిత్రానికి మంచి టీమ్ దొరికింది. అందరు సహకరించారు. కష్టపడి పని చేశారు. నిర్మాతలకు ఋణపడి ఉంటాను. రెండో చిత్రం కూడా నాతో పని చేయడానికి ముందుకు వచ్చారు వారికి థ్యాంక్స్ చేప్పుతున్నాను. సతీష్ బాగా చేశాడు. పెద్ద హీరో అవుతాడు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు సినిమాను చూసి అదరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు జనార్థన్ మంధుముల, సుదర్శన్‌రావు, మెరీనా, సురేష్,కొడాలి వెంకటేశ్వరరావు,ప్రశాంత్ తదితరులు పాల్గోన్నారు.