ఇబ్బందులు, ఆర్థిక సమస్యల వలయం నుంచి బయటపడి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది రుద్రమదేవీ. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన ఈ 3డి బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2,700 థియేటర్లలో ఇవాళ విడుదలైంది. అనుష్క లీడ్ రోల్ లో, రానా, అల్లు అర్జున్, ప్రకాశ్ రాజ్, కృష్ణంరాజు, కేథరిన్, నిత్యామీనన్ తారాగణంగా నటించారు.
ఇక ఈ చిత్ర గురించి టాక్ మెల్లిగా బయటకు వస్తుంది. రుద్రమదేవీ పాత్రలో అనుష్క ను తప్ప వేరే నటిని ఊహించుకోలేమని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మొత్తంలో ప్రధాన ఆకర్షణ బన్నీనేనట. గోనాగన్నారెడ్డి పాత్రలో అర్జున్ బాడీ లాంగ్వేజ్, వేషాధారణ, ముఖ్యంగా తెలంగాణ యాస ఆకట్టుకుంటుందట. తన ప్రత్యేక పాత్ర ద్వారా జనాల్ని రిపీటెడ్ గా థియేటర్లకు రప్పించటం ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచేవి కథ, నిర్మాణ విలువలు. అంతేకాదు మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువుగా నిలుస్తుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి ప్రధాన మైనస్ ఎడిటింగ్ అట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమా సాగదీసినట్లు, పాటలు కూడా సినిమా ఫ్లో ను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు భోగట్టా. ఇక పూర్తి రివ్యూ కాసేపట్లో ఓపికపట్టండి.