కష్టకాలంలో గుణశేఖర్ ని రుద్రమదేవీ ఆదుకుంది. మంచి కలెక్షన్లతో దూసుకుపోవటంతో పోటీగా వచ్చిన బడా సినిమాలను పక్కన పడేసింది. కలెక్షన్ల పరంగా ఎంత సాధించిందో ఇప్పటిదాకా సరైన లెక్క లేనప్పటికీ మొత్తానికి గుణను అయితే సేఫ్ జోన్ లోకి లాగిందని సమాచారం. తాజాగా ఈ చిత్రం మరో ఫీట్ సాధించిందని సమాచారం. ఓవర్ సీస్ లో ఈ చిత్రం మిలియన్ డాలర్ వసూలు చేసిందని తెలుస్తోంది. తెలుగు .. తమిళ వెర్షన్స్ కలుపుకుని అక్కడ ఇది ఫీట్ ను సాధించింది. అంతేకాదు విజయ్ పులి చిత్రాన్ని కలెక్షన్లు కూడా ఓవర్సీస్ లో రుద్రమదేవీ సాధించటం విశేషం.
ప్రాణం పెట్టి 'రుద్రమదేవి'ని తెరకెక్కించడానికి గుణశేఖర్ ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు. చివరికి పూర్తయ్యాక కూడా రిలీజ్ చేసేందుకు కూడా అంతే కష్టపడ్డాడు. నిర్మాణం విషయంలోనూ .. ప్రచారం విషయంలోనూ రాజీ పడలేదు. విడుదల వరకూ ఆయన్ని టెన్షన్ పెడుతూ వచ్చిన ఈ సినిమా, చివరికి ఆయన హమ్మయ్య అనుకునేలా చేసింది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ లోను మంచి ఆదరణ లభించింది. మొత్తానికి ఎలాగోలా ఆయన ఆశించిన విధంగానే మిలియన్ డాలర్లను రాబట్టి గుణకు పెద్ద ఊరటనే కలిగించింది.