బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ సోదరి ఫయిస్టా 50 లక్షల ఖరీదు చేసే మెర్సిడెస్ బెంజ్ కారును పోగొట్టుకకుంది. ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్ తనను మోసగించి కారును ఎత్తుకుపోయాడట. అఫ్తాబ్ పటేల్ అనే మొంబైకి చెందిన మోసగాడు కారు కొంటున్నట్టు నమ్మ బలికి కారుతో సహా ఉడాయించాడు. ఫయిస్టా తమ మెర్సిడెజ్ కారును ఆన్ లైన్ ద్వారా ఈ నెల 7న అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ప్రకటన చూసిన అఫ్తాబ్ పటేల్ ఫయిస్టాకు ఈ నెల 8న ఫోన్ చేశాడు. అదే రోజు కాందివ్లీ అనే విలేజ్ వద్ద సాయింత్రం కలిసి ఈ విషయమై మాట్లాడుకున్నారు. రూ. 42 లక్షలకు బేరం కుదిరింది. కారు కొనే ముందు తాను టెస్ట్ డ్రైవ్ చేస్తానని ఆఫ్తాబ్ పటేల్ కోరాడు. తర్వాత ఒక రోజు ఉదయం 8 గంటలకు తన స్నేహితులతో కలిసి వచ్చిన ఆప్తాబ్ పటేల్, డ్రైవర్ అర్షాద్ అన్సారీకి అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చాడట. అనంతరం టెస్టు డ్రైవింగుకు వెళ్లి వచ్చాడు. మిగతా డబ్బు చెల్లించి కారు తీసుకెళతానని చెప్పాడు. డబ్బు తన ఖాతాలో జమ చేయాలని అఫ్తాబ్ పటేల్ కు సూచించింది ఫయిస్టా. అయితే మరో సారి టెస్ట్ డ్రైవింగ్ చేస్తానని మరో రోజు ఆమె ఇంటికి వెళ్లి కారు తీసుకెళ్లిన అఫ్తాబ్ పటేల్ ఇక తిరిగి రాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఫయిస్తా.