మెగా హీరో అనుకరించడం ఆపేస్తాడంట

May 09, 2016 | 11:52 AM | 1 Views
ప్రింట్ కామెంట్
sai-dharam-tej-new-look-for-tikka-niharonline

మెగాస్టార్ చిరంజీవి స్టైల్ ను నట వారసులుగా వచ్చిన వారు కొత్తలో ప్రతీ ఒక్కరూ ఆయన్ను అనుకరించిన వారే. పవన్, బన్నీ, చెర్రీ ఇలా అంత రాను రాను నటనలో పరిణితి పెంచుకోవటంతోపాటు ఆ మార్క్ ను పక్కన పెట్టేసుకుని, తమ కంటూ ఓ సొంత బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్ మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ కూడా ఆ మార్క్ లో కాకుండా తన పంథాలో వెళ్లేందుకు ఇష్టపడుతున్నాడు. కానీ, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం ఆ ముద్ర నుంచి బయటికి రాలేకపోతున్నాడు.

                                          మాస్ లుక్ తో ప్రతీ సినిమాల్లోనూ చిరును అనుకరిస్తున్నాడనే కంప్లైంట్ సాయిపై ఉంది. దానికి తోడు ఆయన చిరంజీవి పాట ఒకటి తన సినిమాల్లో తప్పకుండా రీమిక్స్ చేయటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక నుంచి ఈ పద్ధతికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాడంట. మిగతా మెగా హీరోల్లా ఇక నుంచి నటనలో తనదైన ముద్ర వేయాలని సాయిధరమ్ తేజ్ భావిస్తున్నాడట. దీనికోసం ముందు తన లుక్ ని టోటల్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. హెయిర్ స్టైల్ తోపాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా వైవిధ్యం చూపాలని కసరత్తు చేస్తున్నాడు. పైగా అప్ కమింగ్ ప్రాజెక్టు తిక్కలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కావటంతో ఇది కంపల్సరీ అయ్యింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రం ద్వారా మెగా హీరో కొత్త లుక్ ని చూపబోతున్నాడంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ