తిక్కతో వస్తున్న మెగా మేనల్లుడు

July 31, 2015 | 12:02 PM | 5 Views
ప్రింట్ కామెంట్
sai_dharam_thej_thikka_niharonline

మేనత్త, మేనమామల పోలికలు తప్పకుండా వచ్చి తీరుతాయంటారు. అందరి సంగతి ఏమో గానీ... సాయి ధరమ్ తేజ్ కి మాత్రం మేనమామల హార్డ్ వర్క్ నేచర్, నట వారత్వం బాగా దిగిపోయినాయి. అదృష్ట రేఖలు కూడా దిగిపోయినట్టున్నాయి మరి. నిన్న కాక మొన్న వచ్చిన ఈ హీరో ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. రామ్ చరణ్ ఎనిమిదేళ్ళ కెరీర్ లో చేసింది 8 సినిమాలే. సాయి మాత్రం గతేడాది నవంబర్ లో ఒక సినిమా ఆర్నెల్లు తిరక్కుండానే మరో సినిమా విడుదల చేశాడు. సుబ్రహ్మణ్యం విడుదల తేదీని ప్రకటించేశాడు. ఈరోజు ఓం దర్శకుడు సునీల్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకి కొబ్బరి కాయ కొట్టేశాడు. ఈ సినిమా టైటిల్ కూడా మెగా ఫాన్స్ పిచ్చేక్కిపోయేలా ‘తిక్క’ అని పెట్టేశారు. హ్యాండిల్ విత్ కేర్ అనే కాప్షన్ తగిలించుకుని మరీ వస్తున్నాడీ మెగా మేనల్లుడు.   ఇన్నాళ్ళు మామల తిక్కరేగిపోయే యాక్షన్ చూసిన మెగా అభిమానులు ఈ సినిమాలో అల్లుడు తిక్కను కూడా చూడబోతున్నారు. ఇక ఈ కుర్రహీరో స్టార్ హీరో కావడానికి మరెన్నాళ్ళో టైమ్ లేదనిపిస్తోంది. ఈ సినిమాలో ఈ మెగా హీరో ఐదుగురు అమ్మాయిల్తో ఆడి పాడతాడట!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ