సైఫ్ కూతురేనా ఇంత సెక్సీగా మారింది!

April 06, 2016 | 05:21 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Sara-Ali-Khan-new-look-niharonline

సెలబ్రిటీ పర్సనల్ వ్యవహారాలపై బహుశా మన మీడియా చూపినంత ఆసక్తి ఎవరూ చూపరేమో! పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి వారు ఆయా రంగంలోకి ఎంటర్ అయ్యేదాకా ఫ్రీ పబ్లిసిటీతో హోరెత్తిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నది కూడా అదే. ఇక్కడ ఫోటోలో కనిపిస్తోంది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పెద్ద కూతురు సారా.  ప్రస్తుతం కొలంబియాలో ఉన్నత చదువులు చేస్తోంది. సైఫ్ కి అంతపెద్ద కూతురు ఏంటంటారా? కంగారు పడకండి మొదటి భార్య అమృత సింగ్ సంతానమే ఈ సారా.  

                                    అయితే కొన్నాళ్ల క్రితం ఉన్న సారాకి ఇప్పుడున్న సారాకి చాలా వ్యత్యాసమే ఉందండోయ్. లావుగా బండగా ఉండే సారా ఇప్పుడు స్లిమ్ గా సెక్సీగా మారిపోయింది. తండ్రి అనుమతితో త్వరలో బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోతున్న ఈ భామ ప్రస్తుతం మలిబు దీవుల్లో హాలీడేస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో ఆరంగ్రేటం చేయబోతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కరణ్ జోహర్ నుంచి రాబోతున్న ఈ చిత్రంలో శ్రీదేవీ కూతురు జాహ్నవి కపూర్ కూడా పరిచయం కాబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా బరువు తగ్గి ఈ లుక్ లోకి మారిన  సారా ను చూస్తే కుర్రకారు మతిపోవటం మాత్రం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ