అవును... బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కంటతడి పెట్టాడు. హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పు కోసం బుధవారం కోర్టుకు హాజరైన ఆయన ఏడ్చేశారట. అంతేకాదు తీర్పు చెబుతున్న సమయంలో న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారట ‘‘ నాడు కారు నడుపుతున్న సమయంలో మందు తాగి ఉన్నారు. డ్రైవర్ కారు నడిపారంటూ కోర్టు ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అంటూ న్యాయమూర్తి సల్మాన్ ను కడిగిపాడేశారట. తీర్పు అనంతరం సల్మాన్ సోదరులిద్దరూ ఆయనను వదిలిపోగా, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 13 ఏళ్లుగా నలిగిన ఈ కేసులో ప్రస్తుతం సల్మాన్ దోషిగా తేలాడు. మరి ఎంత శిక్ష పడుతుందనేది మరికాసేపట్లో తేలనుంది.