2002 లో అర్థరాత్రి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమైన సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది. ఈ కేసు పదమూడేళ్ళుగా నడిచి తుది తీర్పు నేడు వెల్లడించారు. ఐదేళ్ళ శిక్షతో పాటు 25 వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసు అయిన వెంటనే ఆయనను అరెస్టు చేసి ఆర్ధర్ రోడ్డు జైలుకు తరలించారు. సల్మాన్ అరెస్టుతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక సల్మాన్ అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారట. కుటుంబ సభ్యులు కూడా తల్లడిల్లి పోతున్నారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ ముంబై హై కోర్టును ఆశ్రయించబోతున్నాడు. దీనికి వీలుందని కోర్టు కూడా సెలవిచ్చిందట. సల్మాన్ తరఫు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. సల్మాన్ కు ఈ శిక్ష పడిందని తెలియగానే సినీ నటులు, స్నేహితులు ఆయన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.