యామీ వలలో సల్మాన్ చెల్లెలి భర్త

December 02, 2015 | 03:05 PM | 4 Views
ప్రింట్ కామెంట్
salman_sister_husband_pulkit_samrat_affair_with_Yami gautam

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ, నటి యామీ గౌతమ్ బాలీవుడ్ లో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అయితే అది ఏ సినిమా ద్వారా అనుకుంటే పొరపాటే. మొదట్లో గ్లామర్ కి దూరం దూరం అంటూనే ఆ తర్వాత తెగ ఎక్స్ పోజింగ్ చేసేసింది. అయినా అవకాశాలు రాలేదు. ఇక ఇఫ్పుడు ఓ నటుడితో పెట్టుకున్న అఫైర్ కారణంగా తిరిగి వార్తల్లోకి ఎక్కేసింది. ఆఫర్ల సంగతి పక్కనపెట్టి ఇప్పుడు ఈ అఫైర్ తో  హాట్ గా వార్తల్లోకి ఎక్కేసింది. ఈవిడగారు రిలేషన్ మెయింటెన్ చేసేది ఎవరితోనో కాదు యువనటుడు పుల్కిత్ సామ్రాట్ తో. ఇలా అంటే ఎవరికీ తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు శ్వేతా రోహిరా భర్తే ఈ పుల్కిత్ సామ్రాట్ తోనట.

                               ఇద్దరూ పబ్బులు, పార్టీలు అంటూ తెగ తిరుగుతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే యామీ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదట. యామీ కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయట. అయినా కూడా ఈ చిన్నది అవేమీ పట్టించుకోకుండా అతగాడితో  స్నేహాన్ని కంటిన్యూ చేస్తోందట! గత ఏడాదే సల్మాన్‌ఖాన్ తన చెల్లెలు శ్వేతా రోహిరా పెళ్లిని ఘనంగా జరిగింది. అయితే యామీ మోజులో పడిన పుల్కిత్ సామ్రాట్ శ్వేతా రోహిరాను పట్టించుకోకుండా పోవటంతో  వారిద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రెండు రోజుల క్రితం యామీ బర్త్ డేకి పుల్కిత్ స్పెషల్ విషెస్ కూడా చెప్పటంతో అఫైర్ బట్టబయలు అయ్యింది. పచ్చని సంసారంలో యామీ రగల్చిన ఈ చిచ్చు ఎంతదాకా దారితీస్తుందో. మరిప్పుడు సల్మాన్ ఖాన్ స్పందన ఏంటో బాలీవుడ్ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ