హైదరాబాద్ లో సల్మాన్ బట్టలు

February 13, 2015 | 12:35 PM | 29 Views
ప్రింట్ కామెంట్
Being_human_salman_khan_niharonline

హీరోల స్క్రీన్ లైఫ్ తప్ప రియల్ లైఫ్ లో వాళ్ళు ఏం చేస్తుంటారనే సమాచారం చాలా తక్కువగా చదువుతుంటాం. దాదాపు 20 ఏళ్ళుగా బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరుపొందిన సల్మాన్ ఖాన్ రీల్ లైఫ్ పక్కన పెట్టి చూస్తే అతనో పెద్ద వ్యాపార వేత్త కూడా. ఆయనకు భారతదేశం మొత్తంలో 32 బట్టల దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 33వ స్టోర్ హైదరాబాద్ లో ఓపెన్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. తారలు సంపాదించిన మొత్తంలో కొంత భాగం చారిటీలకు ఇవ్వడం ఎన్నాళ్ళుగానో జరుతోంది. అలాగే సల్మాన్ కూడా “బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్” అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున బట్టలు అమ్ముతూ, ఆ డబ్బులను పేదవారి సహాయార్ధం ఉపయోగిస్తుంటాడు. బీయింగ్ హ్యూమన్ క్లాతులు చాలా ఖరీకదైనవి, ఈ బ్రాండ్ అంటే సెలబ్రిటీల్లో కూడా బాగా క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ బ్రాండ్ బట్టలు హైదరాబాద్లో షాపర్స్ స్టాప్, లేదా మరికొన్ని పెద్ద మాల్స్ లోనే దొరికేవి. కానీ ఇప్పుడు డైరెక్టుగా వీటిని కొనేందుకు బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ బట్టల షాపు 33 వ స్టోర్ ను హైదరాబాద్ ఇన్-ఆర్బిట్ మాల్ లో ఓపెన్ చేస్తున్నట్లు సల్మాన ఖాన్ ప్రకటించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ