‘సన్ ఆఫ్ పెదరాయుడు’ రెడీ అవుతున్నాడు

February 12, 2015 | 05:55 PM | 37 Views
ప్రింట్ కామెంట్
Manchu_manoj_niharonline

మంచు విష్ణు నిర్మాతగా ఇటీవల రూపొందిన చిత్రం 'కరెంట్‌ తీగ' బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. అదే చిత్రం కాంబినేషన్ లో మంచు మనోజ్-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో తిరిగి మళ్ళీ ఓ చిత్రం మొదలవబోతోంది. ఒక కాంబో సక్సెస్ కాలేదంటే మళ్ళీ మార్పులు చేయడం సహజం. కానీ సన్ ఆఫ్ పెదరాయుడు టైటిల్ తో రూపొందే ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రెడీ అవుతోంది. ఇది ఓ యాక్షన్ కామెడీ అని చెప్తున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో కుటుంబమంతా నటించి హిట్ ఇచ్చారు. అందులో మంచు మనోజ్ క్యారెక్టర్ అదరగొట్టే స్టయిల్ లో ఉంది. మళ్ళీ అలాంటి హిట్ ఇవ్వాలని ఇప్పుడు సన్నాఫ్ పెదరాయుడు టైటిల్ ను ఎంచుకున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారట. మోహన్ బాబు పెదరాయుడు పెద్ద హిట్... అదే టైటిల్ తో సుపుత్రుడు చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ