నేనేం పెద్ద అందగత్తెను కాదు

June 30, 2015 | 06:20 PM | 9 Views
ప్రింట్ కామెంట్
samantha_about_her_beautiness_niharonline

ఓ రెండు మూడు సినిమాలు హిట్లు పడ్డాయంటే చాలు హీరోయిన్లతో తామెదో దివి నంచి భూమ్మీదకు దిగివచ్చిన అప్సరసల్లా ఫీలయిపోతుంటారు. కానీ, లక్కీ లేడీగా వరుస హిట్లతో ముద్రపడిపోయిన సమంత మాత్రం అందుకు విరుద్ధం. ఓవైపు టాలీవుడ్ తోపాటు ఈ మధ్యే కోలీవుడ్ లోనూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ తానేమీ అందెగత్తను కానని ఖరాకండిగా చెప్పేస్తోంది. ’’నేనేమీ అందగెత్తనేమి కాదు, ఆ విషయం నాక్కూడా తెలుసు. అయితే పాత్రకు తగ్గట్టు అందంగా ముస్తాబవటం వల్ల నేను బహుశా అలా కనిపిస్తానేమో. అసలు నేను అందగత్తెను అయి ఉంటే కాలేజీ రోజుల్లో కుర్రాళ్లు తనను చూసేవారు కదా. కానీ, ఒక్కరు కూడా తనను కన్నెత్తి చూడలేదు. సో నేనేమీ బ్యూటీ ని కాదు‘‘ అని అంటోంది. వెండితెరపై వెలిగే తారలు ఎలా ఉన్నా సరే తామెదో దేవ కన్యల్లాగా ఫీలవుతూ ఉంటారు. అయితే ఓ వైపు యువకులంతా సమంత నామజపం చేస్తున్నా,  మరో వైపు దర్శక నిర్మాతలు కోట్ల పారితోషికం కుమ్మరిస్తున్నా, హీరోలంతా ఆమెతో జోడీ కట్టేందుకు రెడీ అవుతున్నా ఆమె మాత్రం ఇటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచేదే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ