టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోలతోనే జోడీకడుతూ అగ్రకథానాయికగా వెలుగొందుతుంది సమంత. ఇండస్ట్రీకి ఫ్రెష్ కథానాయికలు ఎక్కువమందే వస్తున్నా, ఆమె టాలెంట్ కి వరుసగా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కోలీవుడ్ లో ఓ కుర్రహీరోకి ఓకే చెబుతుందా అన్నది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. అతనే అధర్వ. 90లో హీరోగా నటించిన మురళి తనయుడే ఈ అధర్వ. ఇతనితో జోడీ కట్టడానికి ఓకే చెబుతుందో లేదోననే ఆసక్తితో కోలీవుడ్ సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే తమిళ్లో సమంతా డెబ్యూ మూవీ బాణా కాత్తాడి (తెలుగులో కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు) లో అధర్వనే కథానాయకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఆ తరువాత సమంత ఏ మాయ చేశావే లో నటించడం, ఆపై తెలుగులో వరుస విజయాలను అందుకుని అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు అధర్వ కెరియర్ మాత్రం ఆ స్థాయిలో స్పీడ్ అందుకోలేదు. చిన్నాచితకా సక్సెస్ లు వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ లు కొట్టే రేంజ్ కి ఎదగలేకపోయాడు. దీంతో తనే హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా సమంతానే తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ప్రస్తుతం సమంతకు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఆమె అయితేనే కరెక్ట్ అని అధర్వ అనుకుంటున్నాడంట. మరి వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ వస్తోన్న సమంతా, తన మొదటి హీరో సినిమాకి తిరిగి ఓకే చెబుతుందా? అనేది కాస్త డౌట్ గానే మారింది. ఇక్కడ విశేషం ఏంటంటే సమంత అధర్వ కంటే రెండేళ్లు పెద్దది కావటం.