స‌మంత కాంప్ర‌మైజ్ కావ‌ట్లేద‌ట

March 12, 2015 | 03:54 PM | 29 Views
ప్రింట్ కామెంట్
samantha_rajesh_niharonloine

షూటింగ్ ఉన్నా లేకున్నా ఫిట్ నెస్ విష‌యంలో స‌మంత ఎప్పుడూ కాంప్ర‌మైజ్ కాద‌ట‌. షూటింగ్ 7 గంట‌ల‌కు ఉంటే త‌ను ఫిట్ నెస్ సెంట‌ర్లో తెల్లారుజామున 5 గంట‌ల‌కే ప్ర‌త్య‌క్ష‌మ‌యిపోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని స‌మంత ఫిట్ నెస్ ట్రైన‌ర్ రాజేష్ రామ‌స్వామి చెప్పారు. ఇప్పుడున్న హీరోయిన్ల‌లో అంత ఫిట్‌గా ఫిట్‌నెస్ గురించి ఆలోచించి మెయింటెయిన్ చేయ‌డం స‌మంత‌కు మాత్ర‌మే సాధ్య‌ ప‌డుతోంద‌ని అంటున్నారు రాజేష్‌. స‌మంత ఫిట్‌నెస్ విష‌యంలో త‌న‌కుతానుగా ఏర్ప‌ర‌చుకునే గోల్స్ కూడా ఆశ్చ‌ర్య‌కరంగా ఉంటాయ‌ని, వాటిని సాధించే వ‌ర‌కు ఆమె నిద్ర‌పోద‌నీ, ఎప్పుడూ వాటి గురించే మాట్లాడుతూ ఉంటుంద‌ని, ల‌క్ష్యం ప‌ట్ల అంత సంక‌ల్పాన్ని తాను ఇత‌ర నాయిక‌ల్లో గ‌మ‌నించ‌లేద‌నీ కితాబిస్తున్నారు రాజేష్‌. ప్ర‌స్తుతం స‌మంత అల్లు అర్జున్ కు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తితో జోడీ క‌డుతోంది. మ‌రోసారి కూడా జోడీ క‌ట్ట‌డానికి ఈ జంట సిద్ధ‌మైపోయారు. తాజాగా స‌మంత త‌మిళంలో మాత్రం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది.విక్ర‌మ్, సూర్య‌, ధ‌నుష్‌, విజ‌య్ చిత్రాల్లో లీడింగ్ హీరోయిన్ స‌మంత‌.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ