సౌత్ ఇండియన్ లక్కీ హారోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో యాక్టివ్ గా పాల్గొంటుందన్నసంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా రోగులకు సేవలు అందిస్తోంది. తనకు ఈ సమాజం ఎంతో ఇచ్చిందనీ, ఈ సమాజం కోసం మనమూ ఎంతో కొంత చేయాలనేది సమంత ఉద్దేశం. ఇప్పుడు సమంత మరో సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ కు పూనుకుంది. అన్ని దానాల్లో అవయవదానం గొప్పదనీ, చనిపోయినా వారి అవయవాల ద్వారా వారు బతికే ఉంటారని అందరిలోనూ స్ఫూర్తిని కలిగించబోతోంది.
సమంత అవయవాలను దానం చేసి, తన అభిమానులకు కూడా పిలుపునిస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ వారు మాక్స్ క్యూర్ హాస్పిటల్స్ – జీవన్‌దాన్ తో కలిసి నవంబర్ 7న ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి నినాదం ‘డోంట్ జస్ట్ లైవ్ ఇన్ వన్ లైఫ్’. ఇలాంటి మంచి పనికి పూనుకున్న సమంతకు అభిమానులు తప్పకుండా స్పందిస్తారనే అనిపిస్తోంది.