నగల యాడ్ లో సమంత తళుక్కు

January 20, 2015 | 04:03 PM | 39 Views
ప్రింట్ కామెంట్

సమంత సినిమాలేమో గానీ ఈ మధ్య కాలంలో యాడ్స్ ద్వారా టీవీలో తళుక్కు మంటోంది. వివిధ ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకరించింది. దీంతో ఒకదానికొకటిగా యాడ్స్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఓ జువెలరీ ప్రకటన ‘జువెల్ వన్’కు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది. ఇప్పటికే ఈమె మాజా, పారగాన్ లక్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కమిట్ అయ్యింది. అయితే కొత్తగా అంగీకరించిన ‘జువెల్ వన్’ కు రకరకాల దుస్తులకు తోడు కొంగొత్త నగలు ధరించి మరింతగా మెరిసిపోతోందీ సుందరి. ఇలాంటి జువెలరీ ప్రకటనల్లో చాలా పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఇంతకు ముందే ఐశ్వర్య, కత్రినాకైఫ్ లు పని చేశారు. లోకల్ కంపెనీ యాడ్ అయినప్పటికీ ఇలాంటి ప్రకటనను ఎంపిక చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటోంది సమంత. రకరకాల నగలు ధరించి నవ్వులు చిందిస్తున్న సమంతను చూస్తే ఈ ప్రకటన ప్రచారం తప్పక సక్సెస్ అవుతుందనిపిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ