రావటం రావటంతోనే గ్లామర్ కథానాయికగా సందడి చేసింది రింగు ఒత్తుల సుందరి తాప్సీ పొన్నూ. అయితే ఆ సందడిని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ప్రస్తుతానికి ఐరెన్ లెగ్ గా ముద్రపడిపోయింది. ఇక ఆ తరువాత ఆమె తమిళ్ సినిమాలపై దృష్టి పెట్టి, అక్కడ తన హవాను కొనసాగించే ప్రయత్నం చేస్తూ అడపా దడపా హిట్లు కొడుతుంది. ఇక తెలుగుకు ఆమె గుడ్ బై చెప్పిందా అనుకుంటున్న సమయంలో అనుకొని ఆఫర్ ఆమెకు తగిలింది. టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో సరసన నటించే అవకాశం ఆమెకు దక్కినట్లు తెలుస్తోంది.
యువ కథానాయకుడు నిఖిల్ తో దర్శకుడు ఐ.వి.ఆనంద్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కథాపరంగా ముగ్గురు కథానాయికలు ఈ సినిమాకి ఆవసరం కావడంతో, ఈ సినిమా యూనిట్ తన అన్వేషణ కొనసాగించింది. నిఖిల్ తో కలిసి స్వామిరారా .. కార్తికేయ చిత్రాల ద్వారా సక్సెస్ ను అందుకున్న స్వాతి ని ఒక హీరోయిన్ గా ఖాయం చేసుకోనున్నారు. ఇక రీసెంట్ గా 'సినిమా చూపిస్త మావ'తో హిట్ కొట్టిన అవికా గోర్ ను మరో కథానాయికగా ఎంపిక చేశారు. తాజాగా మరో కథానాయికగా తాప్సీ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన నిఖిల్ 'శంకరాభరణం' విడుదలవుతూ వుంటే, 2వ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందట.