సమ్మర్ ట్రీట్ కు సమంత రెడీ

February 16, 2016 | 01:02 PM | 1 Views
ప్రింట్ కామెంట్
samantha-summer-2016-release-big-movies-niharonline

చెన్నై సోయగం సమంతకు గతేడాది పెద్దగా కలిసి రాలేదు. తెలుగులో ఒక్కటంటే ఒక్కటే చిత్రం చేసింది. సన్నాఫ్ సత్యమూర్తిలో బన్నీ సరసన మెరిసినప్పటికీ యాక్టింగ్ పరంగా యావరేజ్ మార్క్ మూటగట్టుకుంది. ఇక తమిళ్ లో ధనుష్ తో తంగమగన్ (తెలుగులో నవమన్మథుడు కాస్త ఆడింది), విక్రమ్ తో 10 ఎంద్రాకుల్లా అట్టర్ ఫ్లాప్ లుగా నిలిచాయి. దీంతో ఈ యేడు విడుదలయ్యే భారీ ప్రాజెక్టులపై గంపెడాశలు పెట్టుకుంది.

సమంత నటించనున్న నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఈ సమ్మర్ లోనే రిలీజ్ కానున్నాయి. అందులో ముందుగా నితిన్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న అ.. ఆ... ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రం సమ్మర్ ముందు విడుదల కానుంది. ఇక ఆపై సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం ఈ యేడాది ఆమె చేతిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు. అది కూడా మే లో కాస్త అటు ఇటుగా విడుదల కానుంది. ఇక తమిళ్ లో కూడా పెద్ద ప్రాజెక్టులే రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అందులో విజయ్ తో నటించిన తెరీ, సూర్యతో 24 సమ్మర్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఈ నాలుగింట్లో ఎందులోనూ అమ్మడు ఎక్స్ పోజింగ్ చేయలేదంట. అన్నింట్లోనూ డీసెంట్ రోల్ చేసిందని సమాచారం. ఒకే సీజన్ లో ఒక నటి నటించిన నాలుగు సినిమాలు విడుదలకావటం చాలా అరుదు. చూద్దాం... సమ్మర్ లో సమంత ఏ రేంజ్ లో సందడి చేస్తుందో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ