సమంత సమరంను ఎందుకు కలిసింది?

July 22, 2015 | 11:18 AM | 7 Views
ప్రింట్ కామెంట్
doctor_samaram_samantha_connection_niharonline

మొదట్లో ఓ ప్రముఖ మ్యాగజైన్, ఆ తర్వాత టీవీ చానెళ్ల ద్వారా జనాల్లో సెక్స్ స్పెషలిస్ట్ గా బాగా  పాపులర్ అయిన డాక్టర్ సమరం గురించి అందరికీ తెలిసిందే.  ఆధునిక జీవితంలో ఒత్తిళ్లకు బానిసై శృంగార సమస్యలతో బాధపడేవారికి కావాల్సినంత కౌన్సిలింగ్ చేసి బలం చేకూర్చి కాపురాల్ని నిలబెట్టిన ఘనత ఆయనది. ఇక తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి టాప్ హీరోయిన్ గా ఇప్పుడు సౌత్ లో ఓ వెలుగు వెలుగుతోంది నటి సమంత. మరి వీరిద్దరికి ఏంటీ కనెక్షన్, అసలీ ఫోటో ఏంటనేగా మీ ప్రశ్న, కంగారుపడకండీ...  మా టీవీలో శనివారం రాత్రి 8 గంటలకు కనెక్షన్ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారట. ఇందుకోసం సమంత ఫోటోను ఇలా వాడుకుంటున్నారు. అయితే ఆ కార్యక్రమం ఏంటీ, దాని కాన్సెప్ట్ అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంచుతున్నారు. అంతేకాదు ప్రోగ్రాంకి 'గెస్ వాట్' అంటూ లీడ్ పెట్టి నానాహడావుడి చేస్తున్నారు. అందులో భాగంగానే హైప్ పెంచేందుకు ఇదిగో ఇలా సమరం ముందు సమంత మందు బాటిల్ ఏసుకుని కూర్చున్నట్లు పెట్టారు. తొలుత ఏం అర్థం కానీ ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి షాకయ్యారు. మరి ఈ కాన్సెప్ట్ అసలు దీనికి సమంతకు సంబంధం ఏంటన్న చిక్కుముడి శనివారం రాత్రి వీడుతుంది కదా చూద్ధాం...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ