స్వతహాగా పురోహితుడైన శాస్త్రి ఓ సినిమాలో చేసిన రోల్ తో ఐరన్ లెగ్ అయిపోయాడు. అలాంటి ఐరన్ లెగ్ లతోనే చాలా సినిమాలు చేశాడు ఐరన్ లెగ్ శాస్త్రి బ్రహ్మానందంతో కలిసి. కానీ రాను రాను అవే తరహా అతనికి రావడంతో ఆ తరువాత చిత్రాలు కొన్ని డిజాస్టర్ అయ్యాయి. దాంతో నిజంగానే అతని లెగ్ ఐరన్ అనే ప్రచారం మొదలయ్యింది. ఆ తరువాత అవకాశాలు తగ్గి అతన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆ తరువాత ఆయన మరణించడంతో కుటుంబం దిక్కులేనిదయ్యింది. దేవాలయాల్లో ప్రసాదం వండి అతని భార్య ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. పూటగడవని స్థిలో పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోందంటూ టీవీ ఛానల్స్ లో రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ నుండి నటుడు సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ స్పందించారు. నటుడు సంపూర్ణేష్ బాబు తన వంతుగా రూ. 25వేల సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇతరులు కూడా వారి కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. సందీప్ కిషన్ కూడా వారి కుటుంబానికి సహాయం అందించారు. శాస్త్రి కుటుంబానికి సహాయం చేయడానికి మరికొంత మంది ముందుకు రావాలని కోరారు.