నితిన్ తో ఆపేసిన టైటిల్ వరణ్ కు...

October 05, 2015 | 02:14 PM | 3 Views
ప్రింట్ కామెంట్
puri_varun_title_maa_amma_ma_laxmi_niharonline

వరణ్ తేజ్ తో పూరీ జగన్నాథ్ చేస్తున్న లోఫర్ సినిమా టైటిల్ విషయంలో చాలా వార్తలే వచ్చేశాయి. ఒక సమయంలో జేబుదొంగ ఫిక్స్ చేశారనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ను కూడా వద్దని ఓ సాఫ్ట్ టైటిల్ ఎంపిక చేసుకున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్. ఈ సినిమా పూర్తి మదర్ సెంటిమెంట్ తో చేస్తున్నండడంతో ఈ టైటిల్ బాగుండదనుకున్నారు. అందుకే ‘మా అమ్మ సీతామాలక్ష్మి’అని ఫిక్స్ అయ్యారు. దీని ప్రకారం చాలా రోజుల తర్వాత పూరి మరోసారి పూర్తో సాఫ్ట్ టైటిల్ తో మన ముందుకు రానున్నాడు. మరి ఈ టైటిల్ ఎంత వరకూ ప్రేక్షకులకు రీచ్ అవుతుందనేది చూడాలి. మొదట్లో పూరీ జగన్నాథ్ ఇదే సినిమాను నితిన్ తో చేద్దామనుకున్నారు. కానీ ఎందువల్లో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఈ సినిమా మొదలు పెట్టేసి అదే పేరును ఫిక్స్ చేసేశారు. వరుణ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. త్వరలో రిలీజ్ డేట్ తో పాటు టైటిల్ తో లుక్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ