బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అసలు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్(హీరో) గా మారిపోయాడు. రీసెంట్ మూవీ సింగం123 ఫ్లాప్ అయినప్పటికీ తొలిరోజు వసూళ్లలో మాత్రం తన సత్తా చాటాడు. ఎంతలా అంటే పెద్ద సినిమాల హీరోలకు ఫ్యాన్స్ పేపర్లు చించి ఎలా గోల చేస్తారో ఆ మాదిరి వాతావరణం థియేటర్లలో కనిపించిందట. అంతేకాదు పోటీగా వచ్చిన పాజిటివ్ టాక్ వచ్చిన అసుర లాంటి చిత్రాన్ని తట్టుకుని తొలిరోజు దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇక మ్యాటరేంటంటే... శుక్రవారం రాత్రి దక్షిణాది చిత్ర పరిశ్రమల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంపూర్ణేష్ కచ్ఛితంగా హాజరవుతాడని అంతా భావించారు. ఎందుకంటే అతను నటించిన హృదయకాలేయం గతేడాది చిన్న చిత్రాల బాక్సాఫీసులో టాప్ గా నిలిచింది. అయితే దానికి సంపూ హాజరుకాలేదు. అంతేనా తాను నటించిన వేర్ ఈజ్ విద్యాబాలన్ చిత్ర ప్రమోషన్లో కూడా సంపూ పాల్గొనలేదు. దీనిపై సంపూ కదిలిస్తే షాకింగ్ కామెంట్లు చేశాడు. పబ్లిసిటీకి దూరంగా ఉంటాను. నా కెరీర్ కి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన ఉంటే నేనే వెళ్తాను. లేదంటే ముందే చెప్పేస్తాను అని వ్యాఖ్యానించాడు. ఫిలింఫేర్ అవార్డుల పంక్షన్ కి పిలువు రావటమే గొప్ప అవకాశం. అలాంటి దానిని సంపూ లైట్ తీసుకున్నాడంటే మనోడికి ఏరేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి. సంపూ బాగా కమర్షియల్ అయిపోయావమ్మా!