2015 మోస్ట్ డిజైరబుల్ లేడీ కవితలు రాస్తోంది...

April 29, 2015 | 01:16 PM | 11 Views
ప్రింట్ కామెంట్
Sania_Mirza_and_soaib_malik_poetry_niharonline

ఇటీవల సానియా మిర్జా భర్త సోయబ్ మాలిక్ తో విడిపోయినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి సానియా స్పందించి అలాంటిదేమీ లేదు... మా మధ్య గొడవలు ఏమీ లేవంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు తనను చంద్రుడితోనూ, భర్త సోమబ్ ను సూర్యుడితోనూ పోల్చి కవితలు కూడా అల్లేస్తోందట. సూర్యుడు, చంద్రుడు దోబూచులాడతారట... ప్రేమించుకుంటారట... ముద్దులాడుకుంటారట. కొన్ని సార్లు దూరమవుతుంటారట.... ఇంకొన్నిసార్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారట... ఇలా తన కవితను ప్రచారానికి పెట్టేసింది. తన భర్తతో కాస్త గొడవ పడినంత మాత్రాన విడిపోయినట్టు కాదంటోంది.  భార్యభర్తలన్నాక గొడవపడడాలూ.... సర్దుకుపోవడాలూ మామూలేనంటోంది. సరే తమ మధ్య ఏ గొడవలూ లేవంటూ ఇంతకుముందు చెప్పింది కదా... మళ్ళీ ఈ కవిత గొడవేంటి? ఇంకా అభిమానులు తనను నమ్మలేదనుకుంటోందా? ఏదేమైనా ఆమె బాధను ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో కానీ... సానియా తమ మధ్య గొడవలు లేవంటూ పదే పదే ఎందుకు భుజాలు తడుముకుంటుందో అర్థం కావడం లేదు....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ