సినిమాలేవీ పెద్దగా లేకపోయినా ఈ అమ్మడు ఎప్పుడూ వార్తలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించేసింది. ఈ కన్నడ అమ్మడు ఏకధాటిగా 104 గంటల పాటు సైకిల్ తొక్కేసి రికార్డుల్లోకి ఎక్కింది. ఈమె కన్నడ నటే అయినప్పటికీ కొన్ని సినిమాల్లో నటించింది. అనుకున్నంతగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఇప్పుడు కన్నడ, మళయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు ఛాలెంజ్ ను మెచ్చుకోవాల్సిందే కాసేపు సైకిల్ తొక్కితే అలసి పోతాం. అలాంటిది కంటిన్యూగా 104 గంటలు సైకిల్ తొక్కడమంటే మాటలు కాదు. తానీ ఛాలెంజ్ ను ఓ సైక్లింగ్ గ్రూప్‌తో కలిసి సాధించింది. ఇటీవలే సంజన రూ.10 కోట్లతో ఓ భవనం కొనేసిందనీ, దాని ఇంటీరియర్ కోసం చాలా పెద్ద మొత్తంలో వెచ్చిందని వార్తల్లో వచ్చింది. అడపాదడపా పార్టీల్లోనూ తళుక్కున మెరిసింది. ఈ మధ్య రోడ్ సైడ్ రేక కల్లు తాగుతూ తన ఫొటోను ట్విట్టర్ లో చేర్చింది కూడా.