వెంకటేష్ కెరీర్ మొదటి నుంచీ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడనే టాక్ ఉంది. మినిమమ్ గ్యారెంటీ ఉండేలా కథలను ఎంపిక చేసుకుంటాడు. గోపాల గోపాల సినిమా తరువాత మంచి కథ కోసం చాలా సమయం తీసుకున్నాడు. ఇప్పుడు క్రాంతి మాధవ్ చెప్పిన కథ నచ్చడంతో ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తీసి మంచి హిట్ అందుకున్న క్రాంతి మళ్ళీ వెంకటేష్ తో ఈ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని యువ నిర్మాత పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నాడు. ఇందులో వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి ‘సంతోషమే సగం బలం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్టు ఈనెల 15వ తేదిన ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది.