పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు అవలంభిస్తున్న ట్రెండ్ ఇదే. అవకాశాల కోసం అందివచ్చిన ఏ ఒక్క విషయంలో కూడా ఛాన్స్ ను వదలటం లేదు. ముఖ్యంగా కుర్రహీరోయిన్లు ప్రమోషన్ల దగ్గరి నుంచి అవార్డు పంక్షన్ల దాకా ఓవర్ ఎక్స్ పోజింగ్ తో అభిమానులకు కనువిందు చేస్తున్నారు. హాలీవుడ్ కి తీసిపోని స్థాయిలో అసలు వంటి మీద బట్టలు ఉన్నాయా అన్న రేంజ్ లో అందాలను ఒలకబోస్తున్నారు. తాజాగా స్టార్ డస్ట్ అవార్డుల ప్రధానం జరిగింది. ఇక అక్కడికి వచ్చిన హీరోయిన్లంతా గ్లామర్ ను ఒలకబోస్తూ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న సప్నపబ్బీలాంటి వారైతే మరీ దారుణం. బాలీవుడ్ లో అరడజను పైగా యాడ్ లలో, ఒకటి రెండు టీవీ షోల్లో సందడి చెయ్యటంతోపాటు ఈ ఏడాది కామోషియన్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది 29 ఏళ్ల సప్న పబ్బీ. ఆ చిత్రం పెద్దగా కలిసి రాకపోవటంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో ఇక చేసేది లేక ఎక్స్ పోజింగ్ ని నమ్ముకుంది. ఆ మధ్య వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేసింది. ప్చ్... వర్కవుట్ అవటం లేదు అనుకుందేమో ఏకంగా అవార్డు పంక్షన్లోకి పీలీకల్లాంటి బట్టల్లో వచ్చేసింది. ఈపంక్షన్ కి రకుల్ లాంటి సౌత్ నటీమణులు కూడా హాట్ గానే వచ్చారు. కానీ, పబ్బీ ఓ మెట్టుదిగజారింది. పింక్ కలర్ డ్రెసులో వచ్చిన ఆ అమ్మది పై ఎద అందాలు పెద్దగా కష్టపడకుండానే మీడియా కంటికి చిక్కాయి. ఇక మనోళ్లు వదులుతారా ఎడా పెడా ఫోటోలు తీసి పారేశారు. అందాల ప్రదర్శన అవసరమే కానీ అవకాశాల కోసం మరీ ఇంత దిగజారిపోవాలా అని ఇప్పుడు చర్చ జరుగుతోంది.