వరుస మరణాలతో శోక సంద్రంలో ఉన్న టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. ప్రముఖ తెలుగు సినీ రచయిత చిలుకోటి కాశీ విశ్వనాథ్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ నుండి విశాఖపట్టణానికి వెళుతుండగా రైల్లో మృతి చెందాడు. దాదాపు 70 చిత్రాలకు రచయితగా ఆయన పనిచేశారు. అగ్రశ్రేణి దర్శకులు రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయబాపినీడు, దాసరి నారాయణరావు దగ్గర పలు చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. ఆయన మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాశీ విశ్వనాథ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నీహార్ ఆన్ లైన్ కోరుకుంటుంది.







