గతేడాది తెలుగు సినిమాల మధ్య పోటీ వాతావరణం తగ్గి విడుదలలో తేదీలను అడ్జస్ట్ చేసుకోవటం మూలంగా వేటి కలెక్షన్లకు పెద్దగా గండి పడలేదు. ఒకటి రెండు అట్టర్ ఫ్లాప్ లు మినహా అన్ని సినిమాలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు బడా సినిమాలు నిలిచి మళ్లీ పోటీకి తెరలేపాయి. అనూహ్యంగా ఆ నాలుగు బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాయి అనుకోండి అది వేరే విషయం. ఇక సమ్మర్ లో ఈ క్లాష్ కి మళ్లీ తెరలేపబోతున్నారని తెలుస్తోంది.
ముందుగా మెగా హీరోల మధ్య ఈ వార్ ఉంటుందని అనుకున్నప్పటికీ, మామయ్య పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ సైడయిపోయాడు. తన పుట్టిన రోజును సైతం త్యాగం చేసి ఆ తేదీని సర్దార్ కి ఇచ్చేశాడు. మరి సరైనోడు విడుదల తేదీలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయాడు. మెగా అభిమానులు కూడా ఈ మాస్ హీరో సినిమా రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే ఇదే రోజు రావాల్సిన మహేష్ బ్రహోత్సవం పోస్ట్ పోన్ కావటంతో ముందు త్రివిక్రమ్ అ..ఆ... కోసం బెర్త్ పై కర్ఛీప్ వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అనూహ్యంగా సరైనోడు కూడా అదే తేదీలో వచ్చేందుకు సిద్ధమైపోతుండటంతో మంచి పోటీ నెలకొననుంది. ఓవైపు ఫ్యామిలీ మూవీస్ తో, పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకుంటాడు త్రివిక్రమ్. మరోవైపు మాస్ , యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి. అసలే సెలవుల సీజన్ లో ఈ క్లాస్ వర్సెస్ ఊర మాస్ చిత్రాల మధ్య జరగబోయే యుద్ధంలో గెలిచేది ఎవరో లెట్ వెయిట్ అండ్ సీ...