పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సినిమాటోగ్రాఫర్ జయన్ విన్సెంట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆగిపోయినట్టు తెలుస్తోంది. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో సెప్టెంబర్ 30కి ముగింపు పలుకుతున్నట్టు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో రాయ్ లక్ష్మి, పవన్ కళ్యాణ్ పై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. రాయ్ లక్ష్మి సర్దార్ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర చేస్తుందట.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ చిత్రం తెరపైకి 2016 సమ్మర్ లో విడుదల చేయాల్సి ఉంది. ఇందులో కాజర్ అగర్వాల్ పవన్ కళ్యాన్ సరసన మొదటి సారిగా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటి వరకూ ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. చిత్రంలో పవన్ కళ్యాన్ డైలాగులు, దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం చాలా హైలైట్ అవుతాయని ఈ చిత్రం బృందం చాలా కాన్షిడెంట్ గా చెపుతోంది.