రిలీజ్ కి ముందే రీమేక్ ఆలోచన?

March 24, 2016 | 11:13 AM | 2 Views
ప్రింట్ కామెంట్
sarainodu-bollywood-remake-niharonline

అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'సరైనోడు' సినిమా, చకచకా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుంటోంది. ఏప్రిల్ 1న ఈ సినిమా ఆడియోను విడుదల చేసి, సినిమాను అదే నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రీమేక్ కి సంబంధించిన టాక్ వినిపిస్తోంది.

                         ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. బాలీవుడ్ లో ఓ యంగ్ హీరోతో ఈ సినిమాను తెరకెక్కించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. గతంలో గీతా ఆర్ట్స్ గజిని చిత్రాన్ని నిర్మించి వంద కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ బ్యానర్ లోనే సరైనోడిని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ .. కేథరిన్ తో కలిసి 'సరైనోడు' చేసే సందడి కోసం, అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకైతే ఆడియో గురించి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ