సత్యమూర్తికి పాత సినిమాకు లింకేంటి?

March 28, 2015 | 03:40 PM | 67 Views
ప్రింట్ కామెంట్
son_of_satyamurthy_release_sentiment_niharonline

సినిమాలకు సెంటిమెంట్లు ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ముహూర్తం చూసుకుని రిలీజ్ చేస్తే బాగా ఆడుతుందా? సినిమా బాగుంటే జనాలు చూస్తారా? నిజానికి ఒక మంచి సినిమాకు పబ్లిసిటీ కూడా అంగా అవసరం ఉండదేమో... సినిమా బాగుంటే కొత్త వాళ్ళతో తీసినా మొదటి రెండు మూడు రోజులు ఆడవేమో కానీ, బాగుందన్న టాక్ వచ్చిందంటే, అందరూ చూడ్డానికి ఇష్టపడతారు. ఇలా నిరూపించిన సినిమాలెన్నో ఉన్నాయి. బన్నీ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మొదటి నుంచీ చాలా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. షూటింగ్ కూడా కాస్త ఆలస్యమే అయ్యింది. ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ సెంటిమెంట్ ఎందుకో అర్థం కావడం లేదు.  ట్రైలర్ వరకు ధీమాగానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ‘ఘరానా మొగుడు’ సినిమా సెంటిమెంటేమిటో? టాలీవుడ్‌లో తనకో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ ఈయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. టాప్ హీరోల్లో స్థానం సంపాదించాడు. మరి చిరంజీవి సినిమా సెంటిమెంట్ ఎందుకు? ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే ఉండగా, 23 ఏళ్ళ కిందట ఆ సినిమా కలెక్షన్లు క్రియేట్ చేసిందని ఆ రోజులు రిలీజ్ చేస్తే అంతటి కలెక్షన్లు వస్తాయా? అయితే దీనికి రెండు రకాల స్పందనలు వస్తున్నాయి. తప్పకుండా ఈ సినిమా రికార్డు కలెక్షన్లు వస్తాయనే వారూ ఉన్నారు. దీన్ని తోసిపుచ్చుతున్నవాళ్లూ ఉన్నారు. ఏది ఏమైనా ఇలా సెంటిమెంట్లూ....అతి ప్రమోషన్లు.... రిలీజ్ డేట్ల మార్పులూ.... ఈ హడావుడంతా సినిమా ఫలితంపై ప్రభావం చూపించే అవకాశమూ లేకపోలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ