కట్టప్పనే నమ్ముకుంటున్న అరవ దర్శకులు

December 04, 2015 | 05:26 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Sathayaraj_most_popular_in_kollywood_after_baahubali_niharonline

తమిళ స్టార్ నటుడు సత్యరాజ్ బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. కట్టప్పగా అందులో ఆయన చూపిన నటన మిగతా పాత్రల్ని డామినేట్ చేసిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. బాహుబలికి ఆ పాత్రే ప్రాణం కూడా. తొలుత స్టార్ హీరోగా చెలామణి అయిన సత్యరాజ్ అప్పట్లో అడపాదడపా తెలుగు చిత్రాల్లోనూ మెరిశారు. ఆ తర్వాత తమిళంతోపాటు తెలుగులోనూ ఆయనకు ఆఫర్లు కరువయ్యాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ను ఆయన తెలుగుతోనే ప్రారంభించాడు. శంఖం లో గోపీచంద్ తండ్రి పాత్రలో మెప్పించారాయన. కానీ, అది హిట్ కాకపోవటంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, మిర్చి బ్లాక్ బస్టర్ అవటంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఇక ఆపై బాహుబలి ఆయన రేంజ్ ను ఎంత పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో తిరిగి కోలీవుడ్ ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తుంది.

                     బాహుబలి కంటే ముందు నాలుగైదు తమిళ చిత్రంలో తండ్రి పాత్రల్లో ఆయన నటించి మెప్పించారు ఆయన. కానీ, ఇప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకునే కథలు తయారు చేసుకుంటున్నారు అక్కడి దర్శకులు. రీసెంట్ మళయాళంలో హిట్ అయిన షట్టర్ (2012) చిత్రాన్ని తమిళ్ లో ఒరునాళ్ ఇరవిల్ పేరుతో తెరకెక్కించారు. ఇందులో సత్యరాజ్ దే కీలకపాత్ర. దీంతో చిత్రం అక్కడ ఘనవిజయం సాధించటంతోపాటు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని ఆయన పేరు మీదే తెరకెక్కించేందుకు సిద్ధమైపోతున్నారు.

                        ఇటీవల కాలంలో దెయ్యం కథలకు డిమాండ్ బాగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ తరహా కంటెంట్ తో వచ్చిన సినిమాలు సాధ్యమైనంత వరకూ విజయాల జాబితాలోకి చేరిపోతున్నాయి. తమిళ్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా తెలుగులో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ్లో 'జాక్సన్ దురై' అనే రూపుదిద్దుకుంటుంది. శిబిరాజ్ .. బిందుమాధవి నాయకా నాయికలుగా నటిస్తుండగా, సత్యరాజ్ దెయ్యంగా కనిపిస్తుండటం విశేషం. ధరణి ధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దొర పేరుతో తెలుగులోనూ విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు. కట్టప్ప క్రేజ్ తో సినిమా ఇక్కడ కూడా కలెక్షన్లు రాబట్టవచ్చనే వారి ఫ్లాన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ