‘కళ్లు’ చిదంబరం పరిస్థితి విషమం

October 19, 2015 | 11:03 AM | 2 Views
ప్రింట్ కామెంట్
kallu-chidambaram-critical-niharonline

సీనియర్ హాస్య నటుడు కళ్లు చిదంబరం అలియాస్ కొల్లూరు చిదంబరం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు  తెలియజేశారు.

         ప్రముఖ చాయాగ్రహకుడు రఘు దర్శకత్వంలో తెరకెక్కిన 'కళ్లు' సినిమాతో ఆయన తెరంగ్రేటం చేశారు. ప్రముఖ రంగస్థల దర్శకుడు ఎల్‌ సత్యానంద్‌ చిదంబరాన్ని కోరడం వెంటనే ఆయన అంగీకరించడం జరిగాయి. ఆ సినిమాలో అద్భుత నటనకుగాను నంది పురస్కారం, కళాసాగర్‌ పురస్కారం కూడా లభించాయి. ఇక అప్పటి నుంచీ తన తొలి సినిమానే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సౌత్ లో దాదాపు అన్ని భాషలు కలుపుకుని 300కు పైగా చిత్రాల్లో నటించారు.

తన కళ్ళతో విచిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తూ సినీ ప్రేక్షకులను నవ్వించి అశేష అభిమానులను సంపాదించుకున్న ఆయన కోలుకోవాలని నీహార్ ఆన్ లైన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ